- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు హాజరైన ఆయనను ఐదు గంటలుగా అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. 2024 మార్చి 10న నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది.
- Advertisement -



