నవతెలంగాణ – హైదరాబాద్: దుర్గం చెరువును సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, ఇక నుంచి ఆ బాధ్యతను తాము తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. దుర్గం చెరువు, పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, నీటిపారుదల, రహేజా అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. సమీప ప్రాంతాల నుంచి మురుగు నీరు చేరడం వల్లే దుర్గం చెరువులో గుర్రపుడెక్క భారీగా పెరిగిందని రంగనాథ్ అన్నారు. అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. దుర్గం చెరువులో గుర్రపుడెక్క పెరగడంతో పర్యాటకం దెబ్బతిన్నది. చెరువులో పర్యాటక బోట్లు కూడా తిరగడం లేదు. బోటింగ్ లేకపోవడంతో సందర్శనకు వచ్చిన పర్యాటకులు నిరాశతో వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ దుర్గం చెరువును సందర్శించారు.
దుర్గం చెరువును వారు పట్టించుకోవడం లేదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



