- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాజమహేంద్రవరం దివాన్‌చెరువు వద్ద మంగళవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్ర ముగించుకుని వస్తున్న నల్గొండ జిల్లా గుండ్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. రోడ్డుపై గేదె అడ్డు రావడంతో ముందు వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా బ్రేక్ వేయగా, వెనుక ఉన్న మూడు బస్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 26 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -



