Wednesday, January 21, 2026
E-PAPER
Homeక్రైమ్బొలెరోను ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి

బొలెరోను ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటకలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచూరు జిల్లాలోని బూదివాళ క్యాంపు వద్ద బొలెరో వాహనాన్ని కారు ఢీకొట్టింది. బొలెరో వాహనంలో కొందరు వ్యాపారులు గొర్రెలు, మేకలను తీసుకుని బళ్లారి వైపు వెళ్తున్నారు. ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. బొలెరో వాహనం పల్టీలు కొట్టగా.. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఏపీకి చెందిన వారని, పేర్లు, ఊరు వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -