- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దావోస్ పర్యటనకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది. సుమారు 680 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత విమానం యూటర్న్ తీసుకుని మెరీల్యాండ్‌లోని బేస్ ఆండ్రూస్‌లో ల్యాండ్ అయింది. విమానంలో చిన్న ఎలక్ట్రికల్ సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ట్రంప్ తన దావోస్ పర్యటనను మరో విమానంలో కొనసాగించారు.
- Advertisement -



