Wednesday, January 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా పెరిగిన బంగారం ధర

భారీగా పెరిగిన బంగారం ధర

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ మార్కెట్లో బంగారం ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పసిడి ఫ్యూచర్స్ ధర గరిష్ఠ స్థాయికి చేరింది. అమెరికా-యూరప్ మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతుందన్న భయాలు, డాలర్ బలహీనపడటంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 4.25శాతం (సుమారు రూ. 4,100) పెరిగి 10 గ్రాములకు రూ.1,56,970 వద్ద సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. ఎంసీఎక్స్ మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ ధర 2.71శాతం పెరిగి కిలోకు రూ. 3,32,451కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇదే ధోరణి కనిపించింది. కామెక్స్‌లో ఔన్స్ బంగారం ధర 4,849 డాలర్లకు చేరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -