- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి, మంత్రి వివేక్ వెంకటస్వామికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెన్నూరు నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ను వీడి.. వెయ్యి మందికిపైగా అనుచరులతో ఇవాళ బీఆర్ఎస్లో చేరనున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి రాజిరెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీనికోసం చెన్నూరు నియోజకవర్గం నుంచి హైదరాబాద్ కి తన అనుచరులతో కలిసి వందలాది వాహనాల్లో బయల్దేరారు.
- Advertisement -



