నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కి కేబినెట్‌లోని నలుగురు మంత్రులు రాజీనామా చేశారు. మార్చి 5న జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ మంత్రి మహబిర్ పున్ మంగళవారం రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో మయాగ్ది జిల్లా నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. కమ్యూనికేషన్ మంత్రి జగదీష్ కరేల్, క్రీడల మంత్రి బబ్లు గుప్తాలు సోమవారం తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వారు ప్రతినిధుల సభ (హెచ్‌ఒఆర్) ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఖరేల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ తరపున లలిత్‌పూర్-2 నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేయగా, సిర్హా -1 నియోజకవర్గం నుండి గుప్తా నామినేషన్ దాఖలు చేశారు. ఇంధన మరియు జలవనరుల శాఖ మంత్రి కుల్మాన్ ఘిసింగ్ రెండు వారాల క్రితం ఆ పదవికి రాజీనామా చేసి, ఉజ్యాలో నేపాల్ పార్టీ చైర్మన్‌గా చేరారు. మంగళవారం ఖాట్మండు నియోజకవర్గం నెం-3నుండి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
నలుగురు మంత్రులు రాజీనామా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



