నవతెలంగాణ – హైదరాబాద్: సూర్యాపేట జాఆ్ల బాల భవన్ ఆధ్వర్యంలో ఆదివారం మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అభివృద్ధి కమిటీ సభ్యులు హమీద్ ఖాన్, పేరెంట్స్ కమిటీ ఉపాధ్యక్షురాలు వెన్న కవిత రెడ్డి, యోగ గురువు నాగేశ్వర్ రావు హాజరై నటరాజ స్వామికి సరస్వతి దేవి చిత్ర పటానికి పూల మాలలు వేశారు. తదుపరి చిన్నారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా అమ్మ గురించి, మహిళా, ఆడబిడ్డ విలువ గురించి వారు మాట్లాడుతూ.. సమాజంలో సంస్కృతి సంప్రదాయం కేవలం మహిళల వల్లే నెలకొని ఉందని, అమ్మగా బిడ్డల కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తూ వారిని తీర్చిదిద్దుతుంది అని తెలిపారు.
అనంతరం తల్లులు అందరూ తమకు పాదపూజ చేసిన తమ పిల్లలకు పూల అక్షింతలు వేసి ఆశీర్వాదం అందించారు. చివరగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. బాల్ భవన్ లో ఇలాంటి వేడుకలు నిర్వహించడం వల్ల తమ పిల్లలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. ఎక్కడా లేని విధంగా ఇంత అద్భుతంగా మాతృ దినోత్సవం వేడుకలు నిర్వహించడం మా తల్లులకు సంతృప్తిని కలిగించిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. మా పిల్లలకు సంస్కృతి సంప్రదాయ పద్ధతుల పట్ల అవగాహన కల్పిస్తూ, కళలు శిక్షణ ఇవ్వడం చాలా బాగుందని, ఎన్నో ఫీజులు ఖర్చు చేసి పంపించే బడుల్లో సైతం అందని ఎన్నో విలువలున్న అంశాలు శిక్షణ అందిస్తున్న బాల భవన్ సూర్యాపేటలో ఉండటం మాకు మా పిల్లలకు దక్కిన అదృష్టం అని ప్రశంసించారు. అనంతరం బాల్ భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ అతిథులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో బాల్ భవన్ సిబ్బంది దాసరి యల్లయ్య ,ఉమారాణి, సత్యనారాయణ సింగ్,అనిల్,సాయి, వీరయ్య, పద్మ, తల్లి తండ్రులు,చిన్నారులు పాల్గొన్నారు.




