Saturday, May 24, 2025
Homeఅంతర్జాతీయంమరోసారి భారత్‌పై ట్రంప్‌ అక్కసు

మరోసారి భారత్‌పై ట్రంప్‌ అక్కసు

- Advertisement -

ఇక్కడి ఐఫోన్లపై
25 శాతం సుంకాలు
ఈయూ పైనా టారిఫ్‌ల దాడి

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు భారత్‌పై అక్కసును వెళ్లగక్కారు. భారత్‌లో తయారు చేస్తోన్న ఐఫోన్లపై భారీగా సుంకాలను పెంచారు. ఇతర ప్రపంచ దేశాల్లో తయారు చేసిన ఐఫోన్లపై 25 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు యూ ఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అమెరికా మినహాయించి ఇతర దేశాల్లో తయారు చేసిన ఐఫోన్‌లను తమ దేశంలో అమ్మితే 25 శాతం టారిఫ్‌ విధిస్తామని స్పష్టం చేశారు. ‘నేను చాలా కాలం క్రితమే ఈ విషయాన్ని ఆపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌ చెప్పాను. అమెరికాలో అమ్మే ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలని, విదేశాల్లో కాదని. భారత్‌తో పాటు మరే ఇతర దేశంలోనైనా తయారు చేసిన ఐఫోన్లను ఇక్కడ అమ్మితే వాటిపై ఆపిల్‌ కంపెనీ అమెరికాకు కనీసం 25 శాతం టారిఫ్‌ చెల్లించాల్సిందే.’ అని తన సొంత సోషల్‌ మీడియా ట్రూత్‌ సోషల్‌ వేదికగా ఓ పోస్టులో పేర్కొన్నారు.
ట్రంప్‌ వ్యాఖ్యలపై ఆపిల్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది. అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఆందోళనల నేపథ్యంలో ఆపిల్‌ కంపెనీ భారత్‌లో తన ఐఫోన్ల తయారీని పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్‌ హెచ్చరికలు భారత్‌కు గొడ్డలిపెట్టుగా మారనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. చైనా తరహాలో యూఎస్‌తో ప్రధాని మోడీ దిక్కారం స్వరం ఎత్తాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
యూరప్‌ దేశాలపై 50 శాతం సుంకాలు
యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాలపై భారీ టారిఫ్‌లను విధిస్తూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆయా దేశాలపై 50 శాతం సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. కొత్త టారిఫ్‌లు జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఇయుతో జరిపిన చర్చలు ఫలవంతం కాలేదన్నారు. చర్చలు నిలిచినందున అధిక సుంకాలు విధిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -