Wednesday, January 21, 2026
E-PAPER
Homeజాతీయంబంగ్లాదేశ్ క్రికెట్ టీంను నిషేధించాలి..ఢిల్లీహైకోర్టులో పిటిష‌న్

బంగ్లాదేశ్ క్రికెట్ టీంను నిషేధించాలి..ఢిల్లీహైకోర్టులో పిటిష‌న్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్:
బంగ్లాదేశ్ క్రికెట్ టీంను అంత‌ర్జాతీయ టోర్నిలో పాల్గొన‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని దేశ‌రాజ‌ధాని ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. స‌దురు వ్యాజ్య‌న్ని విచారించ‌డానికి ధ‌ర్మాస‌నం తిర‌స్క‌రించింది. పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తేజస్ కరియాలతో కూడిన డివిజన్ బెంచ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. విదేశాంగ విధానం, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన విషయాల‌ని, ఈ త‌ర‌హా అంశాల‌పై కోర్టు జోక్యం చేసుకోద‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై అవ‌గాహ‌న లేకుండా పిటిష‌న్లు దాఖ‌లు స‌రైన ప‌ద్ద‌తి కాదని, కోర్టు స‌మ‌యం వృథ అవుతుంద‌ని, మ‌రోసారి ఈ త‌ర‌హా పిటిష‌న్లు వేస్తే భారీ జ‌రిమానా విధిస్తామ‌ని స‌దురు పిటిష‌న్‌దారుడిని ధ‌ర్మాస‌నం హెచ్చ‌రించింది. పిటిష‌న్‌దారుడు త‌న ఫిర్యాదును ఉప‌సంహ‌రించుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -