నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ హ్యట్రిక్ పాలనలో రూపాయి విలువ నేలచూపులు చూస్తోంది. మోడీ ప్రభుత్వ దివాళాకోరు ఆర్థిక విధానాలతో రోజురోజుకు రూపాయి విలువ అంతర్జాతీయంగా పడిపోతుంది. అమెరికన్ డాలర్ వద్ద రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ఠానికి పతనమైంది.ట్రేడింగ్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 91.7450 స్థాయికి పడిపోయింది.
నిన్న ట్రేడింగ్ ముగింపు సమయంలో డాలర్ విలువ రూ.90.9775 వద్ద ఉంది. గడిచిన మూడు నెలల్లో రూపాయికి ఇదే అతిపెద్ద పతనం. ఈ పతనంతో 2026లో ఇప్పటివరకు ఆసియా కరెన్సీల్లో రూపాయి రెండో అత్యంత బలహీన కరెన్సీగా మారింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి దాదాపు 1.98 శాతం నష్టపోయింది.
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంలో జాప్యం, భారత ఎగుమతులపై అమెరికా అధిక టారిఫ్‌లు విధించడం, ముఖ్యంగా విలువైన లోహాల దిగుమతిదారుల నుంచి పెరిగిన డాలర్ డిమాండ్ రూపాయి పతనాన్ని మరింత పెంచింది.



