Wednesday, January 21, 2026
E-PAPER
Homeజాతీయంఘోర రోడ్డు ప్రమాదం..8 మంది దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది దుర్మరణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కర్నూలు జిల్లా సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండో బొలేరో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు కర్నూలు జిల్లా కౌతాళం వాసులు కాగా ఐదుగురు కర్ణాటక వాసులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక రాష్ట్రంలో సిందనూరు వద్ద ఈ ఘటన జరిగింది. కౌతాళానికి చెందిన వాసులు కర్ణాటకలో గొర్రెలు కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా జామ్ అయింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదానికి గురైన రెండు వాహనాలు పక్కక తీయడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంతో కౌతాళంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు ఇంటికి చేరుకుంటారని అనుకున్న కుటుంబసభ్యులకు వారిక తిరిగిరారు అనే తెలిసే సరికి కన్నీరు మున్నీరవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -