Wednesday, January 21, 2026
E-PAPER
Homeఆటలుఐదు టీ20ల‌ సిరీస్‌..బోణీ మ‌న‌దేనా..?

ఐదు టీ20ల‌ సిరీస్‌..బోణీ మ‌న‌దేనా..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ కాసేప‌ట్లో ప్రారంభంకానుంది. నాగపూర్ వేదిక‌గా టీమిండియా-కివీస్ జ‌ట్ల తొలిపోరులో బోణీ కొట్టాల‌ని ఉవ్విళ్లురుతున్నాయి. వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న జోష్‌లో న్యూజిలాండ్ టీం ఉంది. అదే ఊపును టీ20 మ్యాచ్‌లో కొన‌సాగించాల‌ని వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక‌తో బ‌రిలోకి దిగుతోంది. బ్యాక్ టూ బ్యాక్ సెంచ‌రీల‌తో చెల‌రేగిన కివీస్ బ్యాట‌ర్ డ‌రిల్ మిచెల్..ధ‌నాధ‌న్ ఆట‌లో మ‌రోసారి అల‌రించాల‌నే ఉత్సాహంలో ఉన్నాడు. భారత్‌లో న్యూజిలాండ్‌ ఇప్పటివరకు పొట్టి సిరీస్‌లో నెగ్గలేదు. అగ్రశ్రేణి ఆటగాళ్ల రాకతో కదనోత్సాహంతో కనిపిస్తోన్న కివీస్‌ సిరీస్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

మ‌రోవైపు భార‌త్ టీం కూడా తొలి టీంలో విజ‌యం కోసం భారీగా క‌స‌ర‌త్తులు చేసింది. టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకోని కివీస్‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది. అంతేకాకుండా ప్రపంచకప్‌ జట్టులో మార్పులు చేర్పులు, తుది జట్టు ప్రణాళికలు పట్టాలెక్కించేందుకు డిఫెండింగ్‌ చాంపియన్‌కు ఈ సిరీస్‌ ఉపయుక్తంగా ఉండనుంది.

తుది జట్లు (అంచనా)
భారత్‌ : అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌/ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, రింకు సింగ్‌, శివమ్‌ దూబె, అర్ష్‌దీప్‌ సింగ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి.

న్యూజిలాండ్‌ : టిమ్‌ రాబిన్సన్‌, డెవాన్‌ కాన్వే (వికెట్‌ కీపర్‌), రచిన్‌ రవీంద్ర, డార్లీ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మాన్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌ (కెప్టెన్‌), మాట్‌ హెన్రీ, ఇశ్‌ సోధి, జాకబ్‌ డఫ్ఫీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -