Wednesday, January 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమదురోకు మ‌ద్ద‌తుగా భారీ ర్యాలీ

మదురోకు మ‌ద్ద‌తుగా భారీ ర్యాలీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌కు సంఘీభావంగా వేలాది మంది ప్రజలు ర్యాలీ చేపట్టారు. అమెరికా దుశ్చర్యను ముక్తకంఠంతో ఖండిస్తూ.. కారకాస్‌లోని బలీవర్‌ స్క్వేర్‌లో భారీ ప్రదర్శన చేపట్టారు.ఈ కార్యక్రమంలో హాజరైన ప్రజలు సందేశాలను రాశారు. ఆ లేఖలను ”బ్రింగ్‌ దెమ్‌ బ్యాక్‌” అని రాసి వున్న పారదర్శకపు బ్యాలెట్‌ బాక్స్‌లో వేశారు. వెనిజులా యువత కూడా ఈ ప్రదర్శనలో భాగస్వామ్యమయ్యారు. విదేశీ జోక్యానికి వ్యతిరేకంగా దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. మదురో, సిలియా ఫ్లోరెస్‌లు కొత్త తరానికి ఐక్యతకు మరియు ప్రతిఘటనకు ఉదాహరణగా నిలుస్తారని యువత పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -