- Advertisement -
నవతెలంగాణ – ఊరుకొండ
జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా ఊరుకొండ ఎస్సై కృష్ణదేవ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. బుధవారం జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు, వాహన చోదకులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనం నడిపేటప్పుడు మద్యం సేవించరాదని.. ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని.. వాహనాల సంబంధించిన పూర్తి పేపర్లు, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్, ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



