Wednesday, January 21, 2026
E-PAPER
Homeజిల్లాలుహామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం

- Advertisement -

– మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణలో సంక్షేమ పాలన ప్రజలకు అందిందన్నారు.

ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణారెడ్డి  రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తానన్న హామీ ఏమైందన్నారు. షబ్బీర్ అలీ ఎమ్మెల్యే కాకపోయినా ఎస్కార్ట్‌తో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడగానే సీసీ రోడ్లు, డ్రెయినేజీలకు కొబ్బరికాయలు కొడుతున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టికెట్ రాకపోయినా పార్టీకి ద్రోహం చేయవద్దని కార్యకర్తలకు సూచించారు. మరోసారి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేస్తామని గంప గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -