Thursday, January 22, 2026
E-PAPER
Homeజాతీయంపెద్దమ్మ, పెదనాన్నలకు విషం ఇంజక్షన్లు ఇచ్చి హత్య చేసిన డాక్టర్

పెద్దమ్మ, పెదనాన్నలకు విషం ఇంజక్షన్లు ఇచ్చి హత్య చేసిన డాక్టర్

- Advertisement -

నవతెపలంగాణ – హైదరాబాద్: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అప్పులు తీర్చుకునేందుకు ఓ వైద్యుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. భద్రావతికి చెందిన చంద్రప్ప(80), జయమ్మ(70) దంపతులను జయమ్మ సోదరి కుమారుడు మల్లేశ్‌ విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చి హత్య చేశాడు. కాళ్ల నొప్పులు తగ్గిస్తానంటూ సోమవారం రాత్రి ఇంటికి వెళ్లిన మల్లేశ్‌, చంద్రప్పకు పడకగదిలో, జయమ్మకు హాల్లో ఇంజక్షన్లు ఇచ్చాడు. వారు మృతి చెందిన అనంతరం నగలు, సొత్తు దోచుకుని వెళ్లిపోయాడు. పోస్టుమార్టంలో విషం కారణంగా మృతి చెందినట్లు తేలడంతో పోలీసులు విచారించగా అప్పుల కోసం హత్య చేసినట్లు మల్లేశ్‌ ఒప్పుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -