Thursday, January 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యా చ‌మురు కొనుగోళ్లను భార‌త్ ఆపేసింది: అమెరికా

రష్యా చ‌మురు కొనుగోళ్లను భార‌త్ ఆపేసింది: అమెరికా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 25శాతం టారిఫ్‌లు విధించడంతో ..భారత్‌ రష్యా నుండి చమురు కొనుగోళ్లను నిలిపివేసిందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ పేర్కొన్నారు. బుధవారం బెసెంట్‌ మీడియాతో మాట్లాడారు. ”ఉక్రెయిన్‌తో వివాదం ప్రారంభమైన తర్వాత భారత్‌ రష్యా నుండి చమురును కొనుగోలు చేయడం ప్రారంభించింది. కానీ ట్రంప్‌ వారిపై 25శాతం సుంకం విధించారు.భారత్‌ రష్యా నుండి చమురు కొనుగోళ్లను నిలిపివేసింది” అని పేర్కొన్నారు.

సెనెటర్‌ లిండ్సే గ్రాహం ప్రవేశపెట్టిన బిల్లుపై మాట్లాడుతూ.. ఈ బిల్లును సెనెటర్‌ గ్రాహం సెనెట్‌ ముందు ఉంచిన ప్రతిపాదన అని, అది ఆమోదం పొందుతుందా లేదా అనేది చూడాల్సి వుందని అన్నారు. అయినప్పటికీ అధ్యక్షుడు ట్రంప్‌కు ఆ అధికారం అవసరం లేదని, ఆయన ఐఇఇపిఎ కింద చేయగలరని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. కానీ సెనెట్‌ ఆయనకు ఆ అధికారాన్ని ఇవ్వవచ్చని అన్నారు. రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా యూరప్‌ దేశాలు ఉక్రెయిన్‌పై యుద్ధానికి నిధులు సమకూర్చాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికీ యూరప్‌ రష్యన్‌ చమురును కొనుగోలు చేస్తోందని, ఇప్పడు లేదా నాలుగేళ్ల తర్వాతైనా.. వారిపై వారు యుద్ధానికి నిధులు సమకూర్చుకుంటున్నారని బెసెంట్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -