నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని సావర్ గావ్ గ్రామసభలు బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం సావర్ గావ్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. సావర్గావ్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుక్క ఎంపిక చేసినట్టు తెలిపారు. అందుకే గ్రామంలో 768 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని గుర్తించామని అన్నారు. ప్రభుత్వ భూమిని గుర్తించేందుకు పైలేట్ సర్వేలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం గ్రామస్తులు అందరూ హైలెట్ సర్వేలు పాల్గొని ప్రభుత్వానికి సహకరించాలని సబ్ కలెక్టర్ కోరారు. అంతకుముందు సబ్ కలెక్టర్ సావర్గావ్ గ్రామంలోని అంగన్వాడీ టీచర్ బుజ్జి భాయి సబ్ కలెక్టర్ శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చుక్కలు ఎమ్మార్వో మారుతి , ఎంపీడీవో శ్రీనివాస్ , ఆర్ ఐ యాం పాటిల్, సర్వేయర్ చరణ్ , తదితరులు పాల్గొన్నారు.
గ్రామసభలో పాల్గొన్న బాన్సువాడ సబ్ కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


