- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మయన్మార్ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీరంలో రెండు ఓడలు మునిగిపోవడంతో 427 మంది రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మే 9, 10వ తేదీల్లో ఈ ఘోర ప్రమాదాలు జరిగినట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఈ విషయం నిర్ధరణ అయితే ‘సముద్రంలో చోటుచేసుకున్న అత్యంత విషాదకర ఘటన’గా ఇది మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఓడల ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఐరాస అనుబంధ శరణార్థి విభాగం అంచనా వేస్తోంది. తొలి ప్రమాదం మే 9న చోటుచేసుకోగా 267 మందిలో 66 మంది బతికి బయటపడినట్లు ప్రాథమికంగా వెల్లడించింది. మే 10న రెండో నౌక ప్రమాదానికి గురికాగా.. 21 మంది క్షేమంగా బయటకు వచ్చారాని సమాచారం.
- Advertisement -