నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. కడపలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్‌లోనే మృతిచెందారు.. కడప గువ్వల చెరువు ఘాట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.. కారు-లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో.. ఒక్కసారిగా కారుపై పడిపోయింది లారీ.. దీంతో.. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు.. కారులో ఇరుక్కుపోయిన ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి మృతిచెందారు.. బయటకు తీసేందుకు ప్రయాత్నిస్తున్నారు స్థానికులు.. రాయచోటి నుండి కడపకు వెళ్లున్న సమయంలో గువ్వల చెరువు రెండవ ఘాటులో ఈ ప్రమాదం జరిగింది.. భారీ లోడ్‌తో వెళ్తున్న లారీ.. ఒక్కసారిగా కారుపై ఒరిగి పడిపోవడంతో.. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికితీయడం సవాల్‌గా మారిపోయింది.
కారు-లారీ ఢీ..ఐదుగురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES