నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో ఎన్డేయేను, దాని మిత్రపక్షాలను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తామని సీఎం ఎంకే స్టాలిన్ దీమా వ్యక్తం చేశారు. అనేక విధాలుగా రాష్ట్రాన్ని మోసం చేస్తూ కీలకమైన డిమాండ్లను కేంద్రం దృష్టికి తెచ్చిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. విద్యా సంబంధ నిధులను విడుదల చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. డిలిమిటేషన్ ప్రక్రియపై స్పష్టత కొరవడిందని మండిపడ్డారు. కేంద్రం అండతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న గవర్నర్ తీరును ఖండించారు. ప్రాచీన హోదా పొందిన తమిళ భాషకు నిధులు మంజూరు చేయడంలేదని శుక్రవారం ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రాన్ని తరుచు ప్రధాని మోడీ సందర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. సమగ్ర శిక్షాభియాన్‌కు కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.3,458 కోట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని మోడీని ప్రశ్నించారు. డీలిమేటేషన్ ద్వారా రాష్ట్రంలో నియోజవర్గాలను తగ్గించాలని కుట్రలు చేస్తున్నారని, రాష్ట్ర గవర్నర్.. కేంద్ర ప్రతినిధిగా కాకుండా బీజేపీ పార్టీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు, విపత్తు సహాయ నిధులు, కీలక నివేదికల విడుదలలో, నీట్ మినహాయింపు కోసం రాష్ట్ర డిమాండ్‌ను కేంద్రం తొసిపుచ్చిందని, రానున్న ఎన్నికల్లో ఎన్డేయే కూటమితో పాటు మిత్రపక్షాలను ఓడించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు ఎంకే స్టాలిన్.



