Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న సునీల్ రెడ్డి

ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న సునీల్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో శుక్రవారం జరిగిన లాల్ జామిల ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  ముత్యాల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటంతో లాల్ జామిల కుటుంబ సభ్యులతో  ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేయించారు.

 ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ద్వారా పేద, మధ్యతరగతి వారి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. సొంతింటి కల నెరవేరడంతో  వారి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతీ పేదవాడి సొంతింటి కల నెరవేర్చి వారు ఆత్మగౌరవంతో బతకాలన్న ప్రజా ప్రభుత్వ ఆలోచనలు  నెరవేరుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నరన్నారు.

తమకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసి సొంతింటిని సమకూర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, సునీల్ రెడ్డికి లాల్ జామిల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎనుగందుల శైలేందర్, ఉప సర్పంచ్ తక్కురి రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తక్కురి దేవేందర్, నాయకులు అవారి సత్యం, బోనగిరి లక్ష్మణ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -