Friday, January 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబోర్డ్‌ ఆఫ్‌ పీస్‌లో మేం చేరం: స్పెయిన్‌

బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌లో మేం చేరం: స్పెయిన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ట్రంప్‌ ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’లో స్పెయిన్‌ చేరదని ప్రధాని పెడ్రో సాంచెజ్‌ పేర్కొన్నారు. ఈనిర్ణయం బహుళధ్రువ ప్రపంచం మరియు ఐక్యరాజ్యసమితి వ్యవస్థపై తమ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.” మేము ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కానీ మేము ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’ను నిరాకరిస్తున్నాము” అని గురువారం బ్రస్సెల్స్‌లో జరిగిన ఇయు శిఖరాగ్ర సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి మరియు బహుళ ధ్రువప్రపంచం పట్ల స్పెయిన్‌ నిబద్ధత కలిగి వుందని, దీంతో ఈ ఒప్పందంలో పాల్గొనడానికి నిరాకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌లో పాలస్తీనియా కూడా చేరలేదని అన్నారు.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో గురువారం జరిగిన బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కెనడా, బ్రిటన్‌, హంగేరీ, బల్గేరియా మినహా అన్ని యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఖతార్‌, సౌదీ అరేబియా మరియు యుఎఇ వంటి మధ్యప్రాచ్య దేశాలతో పాటు ఇజ్రాయిల్‌ కూడా ఈ బోర్డులో చేరాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -