నవతెలంగాణ-హైదరాబాద్: నేడు ప్రధాని నరేంద్ర మోడీ కేరళ తిరువనంతపురంలో ఒక ప్యాసింజర్ రైలుతోపాటు మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జైండా ఊపి ప్రారంభించారు. వీటితోపాటు తిరువనంతపురంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.. ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి తిరువనంతపురం మేయర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తన చిరకాల స్నేహితుడు పి.పి రాజేష్‌కు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
కేరళ అభివృద్ధికి కేంద్ర చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయని, కేరళలో రైలు కనెక్టివిటీ నేడు బలోపేతం అయిందని ప్రధాని అన్నారు. తిరువనంతపురంను స్టార్టప్ హబ్‌గా మార్చేందుకు కేంద్రం తీసుకున్న చొరవ గురించి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈరోజు మోడీ పిఎం స్వానిధి క్రెడిట్ కార్టును ప్రారంభించారు. లక్ష మంది లబ్దిదారులకు పిఎం స్వానిధి రుణాలను ఈ సందర్భంగా మోడీ పంపిణీ చేశారు.
కాగా, ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్, గవర్నరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌లు హాజరయ్యారు. నాగర్‌కోయిల్- మంగళూరు, తిరువనంతపురం- తాంబరం, తిరువనంతపురం-చర్లపల్లిలో మధ్య ప్రయాణించే మూడు అమృత్ భారత్ రైళ్లు, త్రిసూర్- గురువాయూర్ మధ్య నడిచే ప్యాసింజర్ రైలును ఈ కార్యక్రమంలో మోడీ ప్రారంభించారు.



