Friday, January 23, 2026
E-PAPER
Homeజాతీయంలక్షలాది భార‌తీయుల‌కు నేతాజీ స్పూర్తిదాయ‌కం: రాష్ట్రపతి ద్రౌపదిముర్ము

లక్షలాది భార‌తీయుల‌కు నేతాజీ స్పూర్తిదాయ‌కం: రాష్ట్రపతి ద్రౌపదిముర్ము

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నేడు స్వాతంత్య్ర పోరాట వీరుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 129వ జయంతి. నేతాజీ జయంతిని పురస్కరించుకుని కేంద్రం నేతాజీ జయంతిని పరాక్రమ దివాస్‌గా జరుపుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నివాళులర్పించారు. ‘నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా పరాక్రమ్‌ దివాస్‌గా జరుపుకుంటారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఈ గొప్ప నాయకుడికి నా వినయపూర్వక నివాళి అర్పిస్తున్నాను.

నేతాజీ ఇచ్చిన స్వాతంత్య్ర పిలుపు లక్షలాది మంది భారతీయుల హృదయాల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఐక్యత, జాతీయవాద స్ఫూర్తిని మేల్కొల్పింది. భారత జాతీయ సైన్యం ద్వారా ఆయన భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి నిర్ణయాత్మక నాయకత్వాన్ని అందించడమే కాకుండా.. దానిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ఆదర్శాలు నేటికీ ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’ అని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
కాగా, నేతాజీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతాజీ ఆలోచనలు కాలాతీతమైనవి. తరతరాలకు ప్రేరణాత్మమైనవి అని మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -