- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి: మండలంలోని ఇసన్నపల్లి శివాలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు గుడి తాళం పగలగొట్టి అర్ధ తులం బంగారం దొంగిలించారు. ఉదయం గుడికి వచ్చిన ఆలయ పూజారి అభిలాష్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు గుడి పరిసరాలను, ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనట్టు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
- Advertisement -



