- Advertisement -
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్: మెదక్ జిల్లా హుస్నాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లలో మధ్య చిక్కుకున్న గాలిపటాన్ని తీస్తుండగా ఓ బాలుడికి కరెంట్ షాక్ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పందిళ్ళ గ్రామానికి చెందిన కంసాని జ్యోతి స్థానికంగా మేడిబావి వీధిలో కిరాయికి ఉంటూ జీవనం సాగిస్తున్నారు. పండగపూట జ్యోతి కుమారుడు ప్రవీణ్ (12) అనే బాలుడు వారి ఇంటి మేడపై గాలి పటం ఎగేరేస్తున్నాడు. ఈక్రమంలో సదురు గాలిపటం విద్యుత్ వైర్లపై పడింది. ఆ కైట్‌ను తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో బయటపడ్డ బాలుడుని మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం వరంగల్‌కు తరలించారు.
- Advertisement -



