Friday, January 23, 2026
E-PAPER
Homeకరీంనగర్ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసిన మున్సిపల్ కమిషనర్…

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసిన మున్సిపల్ కమిషనర్…

- Advertisement -

నవతెలంగాణ–వేములవాడ: వేములవాడ మున్సిపల్ కమిషనర్‌గా ఇటీవల బదిలీపై నియమితులైన కే.సంపత్ కుమార్.. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మున్సిపల్ పరిపాలనకు సంబంధించిన అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.

వేములవాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని మున్సిపల్ కమిషనర్ కే.సంపత్ కుమార్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -