నవతెలంగాణ-హైదరాబాద్: ఈ నెల 15,16న భారత్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ ఏడాది జనవరి 1న, బ్రెజిల్ నుండి బాధ్యతలను స్వీకరిస్తూ, భారతదేశం అధికారికంగా BRICS అధ్యక్ష పదవిని చేపట్టింది. 2012, 2016, 2021లలో శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించిన ఇండియా, ఈ కూటమి అధ్యక్ష పదవిని చేపట్టడం ఇది నాలుగోసారి. ఈక్రమంలోనే తాజాగా గురువారం ఢిల్లీలో బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరిగింది. ఈ సందర్భంగా వారితో పీఎం మోడీ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సభ్య దేశాల మధ్య సహాయ సహకారాలు బలోపేతం దిశగా చర్చలు సాగించాయి. ఆ తర్వాత వారితో కలిసి ప్రధాని ఫొటో దిగారు. ఈ కార్యక్రమానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరాలతో సహా పలువురు విదేశాంగ మంత్రులను కలిశారు.
బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



