Saturday, January 24, 2026
E-PAPER
Homeకరీంనగర్అంతర్ జిల్లా గొర్రెల దొంగలు అరెస్ట్

అంతర్ జిల్లా గొర్రెల దొంగలు అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ-చందుర్తి: అంతర్ జిల్లా గొర్రెల దొంగల ముఠాను చందుర్తి పోలీసులు శుక్రవారం పట్టుకొని అరెస్ట్ చేసినారు. సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేశవ పట్నానికి చెందిన 9 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరవుపేటకు చెందిన ఎక్కల దేవి పర్వతాలు, బుర్రబోయిన కుంటయ్య, లంబ తిరుపతి ఈ నెల 11న మర్రిగడ్డ లో గొర్రెల మందను మేత కోసం తీసుకు వచ్చారు. ఈ క్రమంలో అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నలభై గొర్రెలను ఓ వాహనంలో ఎక్కించి ఎత్తుకెళ్లారు. దీంతో బాధిత గొర్రెల కాపరులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి.. సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించి అరెష్టు చేశామ‌న్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -