Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌కు లీగల్‌ నోటీసులు

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌కు లీగల్‌ నోటీసులు

- Advertisement -

– రాజ్యాంగ బద్ద పదవిని అవమానించడం, అసత్య ఆరోపణలు చేశారని..
– అడ్వకేట్‌ ద్వారా నోటీసులు పంపించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌
– రూ.10 కోట్ల నష్టపరిహారం, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌
నవతెలంగాణ-వికారాబాద్‌

నిరాధార ఆరోపణలు చేసి, తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు రాజ్యాంగ బద్ధ పదవిని అవమానించిన వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ శుక్రవారం లీగల్‌ నోటీసులు పంపిం చారు. తనను మానసికంగా క్షోభ పెట్టినందుకు రూ.10కోట్ల నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారం రోజుల్లో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయవాదుల ద్వారా నోటీసులు అందించారు. లీగల్‌ నోటీసులో స్పీకర్‌ పేర్కొన్న వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఈ నెల 14, 19తేదీల్లో మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ తనపై నిరాధార, తప్పుడు, అసత్య, అభూత కల్పనలు, కట్టు కథలతో కూడిన అవినీతి ఆరోపణలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి, గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. వందల కోట్లు లంచంగా తీసుకున్నానని తీవ్ర ఆరోపణలు చేశారని తెలిపారు. ఇది రాజ్యాంగ బద్దమైన పదవిని అవమానించడమే నని, అదేవిధంగా వికారాబాద్‌ పురపాలక సంఘాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారనే కట్టు కథలు అల్లారని ఆరోపించారు. 14వ తేదీన మీడియా సమావేశంలో తనను బుల్లెట్‌ రాజు అంటూ ఆనంద్‌ అవహేళనగా మాట్లాడి వ్యక్తిగతంగా మనసును గాయపరిచారని తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ కీయ వ్యవస్థలో ఇతరులపై విమర్శలు చేసే స్వేచ్ఛ, స్వాతంత్య్రం రాజ్యాంగం కల్పించింది. కానీ నిరాధార ఆరోపణలు చేయడం మాత్రం అత్యున్నత పదవులను అవమానించడమేనని అభిప్రాయ పడ్డారు. ఇలాంటి చర్యలను సమాజంతో పాటు న్యాయస్థానాలు కూడా సమర్ధించవని. భారతీయ న్యాయ సంహిత 2023 లోని సెక్షన్‌ 499, 500 ప్రకారం దురుద్ధేశ ఆరోపణ లు చేసిన వారు శిక్షార్హులని తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించి నందుకు మెతుకు ఆనంద్‌పై పది కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించడంతో పాటుగా ఏడు రోజుల్లో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని మీడియా ద్వారా బహిరంగంగా క్షమాపణలు తెల పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే న్యాయ స్థానాల ద్వారా తగు చర్యలు తీసుకుంటామని లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -