Saturday, January 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమేడారంలో గుండెపోటుతో భక్తుడు మృతి

మేడారంలో గుండెపోటుతో భక్తుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం వనదేవతల దర్శనానికి వచ్చిన ఎంఆర్‌ వినోద్‌ (58) అనే భక్తుడు శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఈసీఎల్‌కు చెందిన వినోద్‌ కుటుంబసభ్యులతో కలిసి గురువారం సాయంత్రం మేడారానికి చేరుకున్నారు. రాత్రి భోజనాల అనంతరం గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా, తెల్లవారుజామున కుటుంబసభ్యులు లేపేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. వెంటనే మేడారం కల్యాణ మండపంలోని ప్రధాన దవాఖానకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -