Saturday, January 24, 2026
E-PAPER
Homeక్రైమ్వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో దారుణం చోటుచేసుకుంది. డీఎస్పీ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం, దోర్నాలకు చెందిన లాలు శ్రీను (38)కు ఝాన్సితో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. లారీ డ్రైవర్‌గా పనిచేసే శ్రీను చెడు వ్యసనాలకు అలవాటు పడి, గంజాయి విక్రయ కేసులో ఒంగోలు జైలుకు వెళ్లాడు. ఈ సమయంలో ఝాన్సీకి తన తమ్ముడి స్నేహితుడు సూర్యనారాయణతో వివాహేతర సంబంధం ఏర్పడింది. బెయిల్‌పై వచ్చిన శ్రీను బెదిరించడంతో హత్యకు ప్లాన్ చేశారు. పెద్దారవీడు అంకాలమ్మ గుడి వద్ద కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచి హత్య చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -