Saturday, January 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్ రిలీజ్

‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్ రిలీజ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్‌గా నటించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయగా, నేటివిటీ, ఎటకారాలు, రిలేషన్‌షిప్ డ్రామాతో నిండిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటోంది. ట్రైలర్‌ను గమనిస్తే, పెళ్లైన తర్వాత భార్యాభర్తల మధ్య సహజంగా వచ్చే చిన్నచిన్న గొడవలు, భర్త ఇగో వల్ల భార్య ఎదుర్కొనే సమస్యలు కథకు కేంద్రబిందువుగా కనిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -