నవతెలంగాణ బిచ్కుంద
బిచ్కుంద మండలలోని ఆయా గ్రామాలలో పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ లను ఇటీవల రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు. వాటిలోని ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్‌ను దొంగతనం చేస్తున్నారు. దీని కారణంగా రైతులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతూ, పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతోంది.
దొంగతనాల విషయాలపై పలు ఫిర్యాదులు రావడంతో బిచ్కుంద పోలీసులు అప్రమత్తమై రైతులకు పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో బిచ్కుంద పోలీస్ శాఖ గ్రామ ప్రజలకు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని తమ గ్రామాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు, వాహనాలు లేదా అసాంఘిక కార్యకలాపాలు దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం ఇవ్వడానిక డయల్ 100 లేదా బిచ్కుంద పోలీస్ ఎస్సై నంబర్ 8712686176 కు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజల సహకారంతో ఈ తరహా దొంగతనాలను పూర్తిగా నివారించవచ్చని ఎస్సై రాజు అన్నారు.



