Saturday, January 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవిరిగిప‌డిన కొంచ‌చ‌రియ‌లు..ఏడుగురు మృతి

విరిగిప‌డిన కొంచ‌చ‌రియ‌లు..ఏడుగురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. 82 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఇండోనేషియా విపత్తు సంస్థ శనివారం వెల్లడించింది. జావా ప్రావిన్స్‌లో పశ్చిమ బాండుంగ్‌ ప్రాంతంలోని ఒక గ్రామంలో కొండచరియలు విరిగిపడినట్లు స్థానిక అధికారి తెలిపారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వీరిని గుర్తించడానికి మేము రెస్యూ ఆపరేషన్స్‌ ప్రారంభించినట్లు విపత్తు సంస్థ అధికారి అబ్దుల్‌ ముహారీ మీడియాకు వెల్లడించారు. మరోవైపు శుక్రవారం నుంచి వారంరోజులపాటు జావా ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -