Saturday, January 24, 2026
E-PAPER
Homeక్రైమ్తాడిచెర్ల-కొయ్యుర్ రోడ్డుపై భారీ గుంత..!

తాడిచెర్ల-కొయ్యుర్ రోడ్డుపై భారీ గుంత..!

- Advertisement -

ఇబ్బందుల్లో ప్రయాణికులు
చోద్యం చూస్తున్న ఆర్అండ్ బి అధికారులు
నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల నుంచి కొయ్యుర్ వేళ్ళు మల్లారం చెరువు పరిధిలో ప్రధాన రహదారిపై భారీగా గుంత ఏర్పడడంతో ద్విచక్ర ఇతర వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.ఆదమరచి ప్రయాణికులు రాత్రివేళల్లో,పగలైన స్పీడ్ గా వస్తే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.గుంతను పూడ్చాలని ఆర్అండ్ బి అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. ప్రమాదం జరిగితేకాని పట్టించుకోరాని తాడిచెర్ల, మల్లారం, చిన్నతూండ్ల, పెద్దతూండ్ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిత్యం ప్రయాణికులు రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకయాతనను అనుభవిస్తున్నారు.రోడ్డుపై నిత్యం పదుల సంఖ్యలో బొగ్గు లారీలు అడ్డుఅదుపు లేకుండా ఓవర్ లోడ్ తో వెళ్లడం ద్వారానే రోడ్డు ధ్వంసమైన భారీగా గుంతలు ఏర్పడుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు పట్టించుకోని రోడ్డుపై ఏర్పడిన గుంతలు పూడ్చాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -