Saturday, January 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యా చమురు కొనుగోళ్లు త‌గ్గింపు..ఇండియాపై 25 శాతం సుంకాలు తగ్గించనున్న అమెరికా..?

రష్యా చమురు కొనుగోళ్లు త‌గ్గింపు..ఇండియాపై 25 శాతం సుంకాలు తగ్గించనున్న అమెరికా..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రష్యా నుంచి ఇటీవల చమురు కొనుగోళ్లను ఇండియా త‌గ్గించిన నేప‌థ్యంలో టారిఫ్ లు 25 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించే ఆలోచన ఉందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. దావోస్ వేదిక‌గా ఓ మీడియా స‌మావేశం సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఈ అంశాన్ని ట్రంప్ నాయకత్వం పరిశీలిస్తోందన్నారు. అమెరికాలోని ఒక మీడియా సంస్థతో స్కాట్ మాట్లాడారు. ఆయిల్ దిగుమతుల్ని ఇండియా తగ్గించుకోవడం హర్షించదగిన చర్య అన్నారు. టారిఫ్లు ప్రస్తుతం అమలవుతున్నాయని, కానీ, వాటిని తగ్గించేందుకు మార్గం దొరికిందని స్కాట్ అన్నారు. దీంతో తమ ఒత్తిడి ఫలించిందని, టారిఫ్ ల పెంపు మంత్రం పనిచేసింద‌న్నారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ (ఈయూ) మాత్రం ఇండియాపై టారిఫ్లు విధించకపోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ఇండియాతో భారీ ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు ఈయూ ప్రయత్నించడం వల్లే టారిఫ్లు లేవని స్కాట్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -