- Advertisement -
నవతెలంగాణ కమ్మర్ పల్లి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా క్రీడా మైదానంలో ఆదివారం అండర్-16 వాలీబాల్ సెలక్షన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్ ఆసొసిషియన్ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాలీబాల్ సెలక్షన్ కు వచ్చే బాలికలు, బాలురు తమ పదవ తరగతి బోనఫైడ్, ఆధార్ కార్డుతో డీఎస్ఏ గ్రౌండ్ లో ఆదివారం ఉదయం 10గంటలకు హాజరు కావాలని సూచించారు. జిల్లా జట్టు రాష్ట్ర టోర్నమెంట్ లో పాల్గొంటారని చెప్పారు. పూర్తి వివరాలకు సెల్ నెంబర్ 9440711635 లో సంప్రదించాలని తెలిపారు.
- Advertisement -



