Saturday, January 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఐద్వా జాతీయ మ‌హా స‌భ‌లకు స‌ర్వం సిద్ధం..ఫొటోలు

ఐద్వా జాతీయ మ‌హా స‌భ‌లకు స‌ర్వం సిద్ధం..ఫొటోలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆల్ ఇండియా డెమోక‌ట్రిక్ ఉమెన్స్ అసోసియేష‌న్(ఐద్వా-AIDWA) 14వ జాతీయ మ‌హాస‌భ‌లకు స‌ర్వం సిద్ధ‌మైంది. హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ క‌ళ్యాణ మండ‌లం వేదిక‌గా ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. విద్యుత్ లైట్ల‌తో వేదిక‌ను సుంద‌రంగా అల‌క‌రించారు. ప్రాంగ‌ణంలో వీర‌మ‌హిళాల త్యాగాల‌ను గుర్తు చేస్తూ ఫ్లైక్సిల‌ను ఏర్పాటు చేశారు. స్వాగ‌త ద్వారంగా చార్మిమినార్‌తో పాటు కాక‌తీయ క‌ళాతోర‌ణాన్ని ఉంచారు. అదే విధంగా సిటీ వ్యాప్తంగా ఐద్యా గుర్తుతో కూడిన తెల్లజెండాల‌ తోర‌ణాలను ఆయా రోడ్డు మార్గాల పొడ‌వునా అలంక‌రించారు. భారీ ఫ్లైక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. జాతీయ స‌మావేశం సంద‌ర్భంగా రేపు బ‌స్ భ‌వ‌న్ గ్రౌండ్‌లో భారీ బ‌హిరంగ ఏర్పాటు చేశారు. ఈ నేప‌థ్యంలో దేశం న‌లుమూలాల‌ నుంచి ఐద్యా శ్రేణులు త‌ర‌లివ‌స్తున్నారు. ఈ జాతీయ మ‌హాస‌భ‌లు ఈనెల 25 నుంచి 28 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ మ‌హాస‌భ‌ల‌కు ముఖ్య అతిధులుగా జాతీయ ప్యాట్రన్, మాజీ ఎంపీ బృందా కారత్, జాతీయ అధ్యక్షురాలు పి.కె. శ్రీమతి, ప్రధాన కార్యదర్శి మరియం ధావలె, జాతీయ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ సుభాషిణి అలీ, జాతీయ కోశాధికారి ఎస్. పుణ్యావతి, ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి పాల్గొనున్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -