- Advertisement -
- ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ.
నవతెలంగాణ-భువనగిరి: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మహిళలకు పిలుపు నిచ్చినారు. రేపు హైదరాబాద్‌లోని బస్సు భవన్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఐద్వా భారీ బహిరంగలకు మహిళలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
శనివారం భువనగిరి లోని బహార్ పేట్, హనుమాన్ వాడ, హౌసింగ్ బోర్డు కాలనీ, ఇందిరా నగర్‌లో బహిరంగ సభ జయప్రదం కోసం కరపత్ర ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ ఈనెల 25 నుండి 28 వరకు హైదరాబాదులో ఐద్వా ఆల్ ఇండియా మహాసభలను నిర్వహిస్తామని, ఈ మహాసభలకు ముఖ్య అతిధులుగా జాతీయ ప్యాట్రన్, మాజీ ఎంపీ బృందా కారత్, జాతీయ అధ్యక్షురాలు పి.కె. శ్రీమతి, ప్రధాన కార్యదర్శి మరియం ధావలె, జాతీయ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ సుభాషిణి అలీ, జాతీయ కోశాధికారి ఎస్. పుణ్యావతి, ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి పాల్గొంటున్నారని తెలిపారు.
- Advertisement -



