- Advertisement -
- మండల విద్యాధికారి రాజగోపాల్.
నవతెలంగాణ-రాయపోల్: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని, క్రీడలు శరీర దృఢత్వానికి మానసికొల్లాసానికి దోహదపడతయని రాయపోల్ మండల విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం రాయపోల్ మండల రామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే క్రీడలలో భాగస్వామ్యం కావాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. సిఎం కప్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి సర్పంచ్ తూర్పు లక్ష్మి రవి, రామారం సర్పంచ్ ఉషిగారి స్వామి, సయ్యద్ నగర్ సర్పంచ్ షేక్ రూబీన, ఉపసర్పంచ్లు పఠాన్ కమల్, రెడ్డబోయిన పద్మ, భూపాల్, పంచాయతీ కార్యదర్శులు విజయ్, శశికాంత్, బాలయ్య, ప్రసాద్, పిఈటి రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ గ్రామాల యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
- Advertisement -



