- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటన మరువక మందే నగరంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. అల్వాల్‌లోని నైన్ ఎడ్యుకేషన్ బాలికల వసతి గృహంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో పొగ పీల్చడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గరైన విద్యార్థులను జీడిమెట్లలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, వరుసు అగ్ని ప్రమాదంలో జరుగుతుండటంతో నగర ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
- Advertisement -



