- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో మూడు మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం. భవనం సెల్లార్ నుంచి మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ వెలికితీసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భవనంలో చిక్కుకున్న మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -



