Sunday, January 25, 2026
E-PAPER
Homeజాతీయంగుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వేగంగా దూసుకువచ్చిన ట్రక్కు.. ఇన్నోవా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అమీర్‌గఢ్ తాలూకాలోని ఇక్బాల్‌గఢ్ గ్రామ సమీపంలోని పాలన్‌పూర్-అబు హైవేపై ఈ విషాదకర ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇన్నోవా కారు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -