- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మే-2026 సెషన్ డిపార్ట్మెంటల్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ పరీక్షలు మే 23 నుంచి జూన్ 1 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతో పాటు ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ హాల్టికెట్లను మే 18 సాయంత్రం 5 గంటల నుంచి టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.tgpsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మినహా అన్ని పేపర్లకు హాల్టికెట్లు విడుదల చేయనున్నారు. డూప్లికేట్ హాల్టికెట్లు జారీ ఉండదని కమిషన్ స్పష్టం చేసింది.
- Advertisement -



