- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. దీని ప్రభావంతో 21 కోట్ల మంది ప్రభావితమయ్యారు. 14వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 8,50,000 మంది ఇబ్బందులు పడుతున్నారు. టెనస్సీ, మిస్సిస్సిప్పి, టెక్సాస్, లూసియానా రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. సుమారు 20 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. 2వేల కిలోమీటర్ల మేర తుఫాన్ విస్తరించిందని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది.
- Advertisement -



