నవతెలంగాణ – ఢిల్లీ: మండు వేసవి ముందున్న తరుణంలో, LG ఎలక్ట్రానిక్స్, ఇండియా లిమిటెడ్ (LGEIL), అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ (ఎలక్ట్రానిక్స్ విభాగంలో) కొత్త 2026 బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (BEE) స్టార్ రేటింగ్ ప్రమాణాలను పూర్తిగా పాటించే ఎయిర్ కండీషనర్ల సమగ్రశ్రేణిని ప్రవేశపెట్టిన తొలి బ్రాండ్లలో ఒకటిగా తన ఆవిర్భావాన్ని ప్రకటించింది. LGEILని ముందస్తుగా విడుదల చేయటంతో, నేడు లభిస్తున్న అత్యంత అధునాతనమైన, విద్యుత్తును ఆదా చేయగల కూలింగ్ టెక్నాలజీ భారతదేశంలోని వినియోగదారులకు తక్షణం లభిస్తుంది.
అప్డేట్ చేసిన ఈ BEE నిబంధనలు విద్యుత్తు ప్రమాణాల్లో గణనీయమైన ముందడుగును సూచిస్తాయి. అంతర్జాతీయ విద్యుత్తు పెర్ఫార్మెన్స్ ప్రమాణాలతో భారతదేశాన్ని అనుగుణంగా చేసేందుకు యావత్తు పరిశ్రమ కోసం ప్రమాణాన్ని పెంచుతాయి. LGEIL తన ప్రొఫైల్‌ను ముందుగానే అప్‌గ్రేడ్ చేసుకుని, సుస్థిరమైన మరియు బాధ్యతాయుతమైన ఉత్పత్తి అభివృద్ధి పట్ల తన నిబద్ధతను పటిష్టం చేసింది.
2026 లైనప్ యొక్క కీలకమైన ముఖ్యాంశాలు:
· విద్యుత్తు ఆదా మరింతగా పెరుగుతుంది: ఈ కొత్త నిబంధనలను, ఇళ్ళలో విద్యుత్తు వినియోగాన్ని బాగా తగ్గించేందుకు డిజైన్ చేయటమైనది. 2026 నిబంధనలను అనుసరించి కొత్త 5-స్టార్ ACకి అప్‌గ్రేడ్ అయితే, వాడకం మరియు టారిఫ్ రేట్లను అనుసరించి, 10-సంవత్సరాల కాలంలో వినియోగదారులు దాదాపు ₹19,000లను ఆదా చేసుకునేందుకు ఉపయోగపడుతుందని పరిశ్రమ అంచనాలు సూచిస్తున్నాయి.
· కొత్త రేటింగ్లను అర్ధం చేసుకోవటం: కటువైన 2026 ఫ్రేమ్‌వర్క్ క్రింద సామర్ధ్యపు పరిమితిని పెంచటం జరిగింది; ఉదాహరణకు, గతంలో 5-స్టార్‌గా రేట్ చేయబడిన మోడల్‌ను ఇప్పుడు 4-స్టార్‌గా వర్గీకరించవచ్చు. ఈ పునర్వర్గీకరణ, అధిక సామర్ధ్య నాణ్యతాప్రమాణాలను ప్రతిబింబిస్తుందే తప్ప సామర్ధ్యంలో తగ్గుదలను కాదు. తద్వారా ఉత్తమమైన, తక్కువ విద్యుత్తు వాడే టెక్నాలజీని అవలంబించటాన్ని ప్రోత్సహించటం జరుగుతుంది.
· తక్షణ లభ్యత: LGEIL వారి భవిష్యత్తుకు అనుకూలమైన శ్రేణి, జనవరి తొలి రోజులు మొదలుకుని మార్కెట్లో లభించింది – దీనితో తన 2026 BEE అనుగుణ్యమైన రెసిడెన్షియల్ ఎయిర్-కండీషనర్లను ఆఫర్ చేసే తొలి బ్రాండ్లలో ఒకటి అయ్యింది. వేసవి కోసం ముందుగా కొనుగోలు చేసే కస్టమర్లు, కాలం చెల్లిన సాంకేతికపరిజ్ఞానాన్ని కొనుగోలు చేయకుండా ఇది జాగ్రత్త వహిస్తుంది.
· కీలకమై ఫీచర్లు: ప్రీకూల్ మరియు ఎనర్జీ మేనేజర్+ వంటి ఫీచర్లతో కస్టమర్లను సశక్తులను చేయటం మీద మేము ఈ ఏడాది దృష్టిని కేంద్రీకరిస్తున్నాము. ప్రీ కూల్, ఒక వినూత్నమైన ఫీచర్. మీరు అడుగుపెట్టేటప్పటికి మీ ఇల్లు చక్కగా చల్లగా, సౌకర్యవంతంగా ఉండేందుకు ఉపకరించేందుకు డిజైన్ చేసిన విలక్షణమైన ఫీచర్ ఇది. ప్రీకూల్ ఫీచర్ జియో ఫెన్సింగ్ టెక్నాలజీ యూజర్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించటానికి ఉపకరిస్తుంది. ఒక నిర్దుష్టమైన దూరంలోకి మీరు చేరుకోగానే యూజర్ ప్రయోగించిన ఆటోమేషన్‌ను అనుసరించి ThinQ, ఎయిర్ కండిషనర్ను ఆపరేట్ చేస్తుంది. ఎనర్జీ మేనేజర్+ మీ AC వాడకాల హిస్టరీని విశ్లేషించి, వాస్తవికమైన ఆపరేటింగ్ గంటలను మరియు వినియోగాన్ని సిఫార్సు చేస్తుంది. కావలసిన బేసిస్ సిఫార్సుగా పిరియాడిక్ బడ్జెట్ లభ్యంగా యూజర్లు నిర్ధారించుకోవచ్చు.
సంజయ్ ఛిత్కారా, కో-ఛీఫ్ సేల్స్ & మార్కెటింగ్ ఆఫీసర్, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్
విడుదల సందర్భంగా వ్యాఖ్య: ” విద్యుత్తును ఆదా చేసేందుకు సంబంధించి భారతదేశం కఠినమైన నిబంధనల దిశలో ముందడుగు వేస్తున్న దశలో, ముందస్తుగానే నిబంధలను పాటించటం, భవిష్యత్తుకు అనుకూలమైన ఉత్పత్తుల ఆవిష్కరణ ద్వారా LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్, ఈ మార్పుకు సహకరాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నది. మా పోర్ట్‌ఫోలియో ఇప్పటికే కొత్త BEE ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో, విశ్వసనీయమైన, విద్యుత్తును ఆదా చేయగలిగిన ఎయిర్ కండిషనింగ్ సొల్యూషన్లను ఆఫర్ చేసేందుకు LGEIL కొత్త సీజన్లోకి అడుగుపెడుతోంది. ఇది మా వినియోగదారులకు సొమ్మును ఆదా చేసుకునే అవకాశంతోపాటుగా, అత్యుత్తమ కూలింగును కూడా పొందే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది.”
వినియోగదారులకు మార్పును సునాయంగా చేయగలిగేందుకు వీలు కలిగిస్తూ LGEIL, కొత్త స్టార్ రేటింగుల వలన లాభాలను వివరించేందుకు ప్రింట్, డిజిటల్ మరియు రీటెయిల్ ఛానెళ్ళలో ఒక సమగ్రమైన క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తోంది. అంతే కాక, LGEIL తయారీ మరియు సప్లై ఛెయిన్ ఆపరేషన్లను కొత్త మార్గదర్శకాలకు పూర్తిగా అనుగుణంగా మార్చింది. కొత్త 2026-అనుపాలక మోడళ్ళ పై ప్రత్యేకమైన దృష్టి ఉండగా, గతంలోని ప్రమాణాలను అనుసరించి తయారు చేసిన ఎయిర్ కండీషనర్లు, ప్రస్తుత స్టాకులన్నీ అమ్ముడయే వరకు, వినియోగదారులకు తమ కొనుగోలు నిర్ణయాలను తీసుకోవటంలో వీలును కలుగజేస్తూ, అందుబాటులో ఉంటాయి.

